Christian roots in Andhra Pradesh.

క్రైస్తవం భారతదేశంలో మొదటి శతాబ్దిలోనే అడుగుపెట్టింది అని చెప్పడానికి చాలా రకాలైన ఋజువులు వున్నాయి. ఐతే ఈ క్రైస్తవం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 15, 16వ శతాబ్దాలలో అడుగుపెట్టినట్లు కొందరు భావిస్తారు.

ఐతే నా అభిప్రాయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ లో క్రీ.శ మొదటి శతాబ్దపు కాలము నుండే క్రైస్తవం వున్నదని చెప్పడానికి కొన్ని నామమాత్రపు ఋజువులు నేను చూపించదలచాను.

Periplus of the Erythraean Sea అనే ప్రాచీన గ్రంథము నుండి ముందుగా మనం కొన్ని విషయాలు చూద్దాం .

1- Periplus of the Erythraean Sea అనే ఈ గ్రంథాన్ని ఒక గ్రీకు వ్యాపారవేత్త క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే రాసినట్లు చరిత్రకారులు దృవీకరించారు. సముద్ర మార్గము ద్వారా వ్యాపార సంబంధాలను ఇంగ్లీషులో Maritime trade relations అని అంటారు. రోమన్ ప్రజలకు మరియు మచిలీపట్నం వాసులకు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్లు The Periplus of the Erythraean Sea : travel and trade in the Indian Ocean అనే పుస్తకంలో ఉంది. ఈ పుస్తకంలో ఉన్నది. ఐతే ఈ మచిలీపట్నం అనే పేరుకు బదులు, మసాలియా (Masalia)…..Which survives in Machhlipatana అని రాసి ఉంది.

2- గ్రీకు రచయిత రాసిన ఈ మసాలియా అనే పేరు తెలుగులో ఏ గ్రంథంలో ప్రస్తావించబడిందో ట్రేస్ చేయడానికి కొన్ని పాత పుస్తకాలను తిరగేసాను. ఇలా కనీసం ఓ 25 పాత తెలుగు పుస్తకాలును పరిశీలిస్తే అప్పుడు ఈ పదం నాకు 1910 నాటి తెలుగు పుస్తకాలలో తారసపడింది. ఇక్కడ ఋజువులు పెడుతున్నాను చూడండి. ఈ మసాలియా అనే పేరును మనము నవీన భాషలో మచిలీపట్టణం అని పిలుస్తున్నాము.

3- సాహితీవాల్లభ్యము మొదటి భాగము ’సాహితీ వల్లభ’ ’ఆంధ్ర భోజ’ శ్రీ ముళ్లపూడి తిమ్మరాజుగారి అభినందన సంపుటి అనే గ్రంథంలో కూడా మచిలీపట్నానికి మరియు రోమ్ నగరానికి మధ్య సముద్ర మార్గం ద్వారా వ్యాపార సంబంధాలు ఉన్నట్లు రాయబడినది. ఇక్కడ డైరెక్ట్ పుస్తకంలో నుండి ఋజువు పెడుతున్నాను చూడండి.

4- దేవరకొండ చిన్ని కృష్ణశర్మ అనే చరిత్రకారుడు ఇంకో అడుగు ముందుకు వేసి ఇలా రాసాడు- క్రీ.పూ 1500 సం.రాల కాలానికే దక్షిణ భారతదేశానికి పశ్చిమాసియాకు మధ్య సముద్రయానం జరుగుతున్నట్లు స్పష్టమైన ఋజువులు వున్నవి అని, అదేవిధంగా సాలమన్‌ ప్రభువుకు మూడేండ్లకొక మారు బంగారమూ, వెండీ, దంతపు సామానులూ, కోతులూ, నెమళ్ళూ, మంచి గంధపు చెట్లు, అమూల్యమైన రత్నాలూ చేరుతూ ఉండేవని యూదు గ్రంథాల్లో కనబడుతున్నదని రాసాడు.

5- ఆంధ్ర సదుక్తి కర్ణామృతము అనే గ్రంథంలో, యన్ యస్ సుందరేశ్వరరావు మరియు శ్రీకృష్ణమూర్తి అనే ఇద్దరు చరిత్రకారులు ఇలా రాసారు-తీరప్రదేశాల నుండి సాధారణమైన బట్టలతో పాటు, అన్ని రకాల రవశల్లాలు, పువ్వులు గుడ్డలు ఇంకా కొన్ని వాణిజ్యపు సరుకులు ఇక్కడికి తెస్తారు. ఇక్కడే మసాలియా (మచిలీపట్టణం) ఉంది.

6- ఘంటసాల అనే గ్రంథంలో ఇలా ఉంది- మసాలియా అనగా మచిలీపట్నమే అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అని గొర్రెపాటి వెంకటసుబ్బయ్య అనే పరిశోధకుడు రాసాడు, ఇక్కడ ఋజువు పెట్టాను చూడొచ్చు.

7- ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర- Vol-1 లో కంభంపాటి సత్యనారాయణ అనే చరిత్రకారుడు ఇలా రాసాడు. రోమను నాణేలు తెలంగాణంలోనూ దొరికాయి. మూడు సూర్యాపేటలో దొరికాయి. మరొకటి ఏలేశ్వరం తవ్వకాలలో శాతవాహానరాజు పులమావి రెండు నాణేలతో పాటు దొరికింది. ఇవీ ఇక్కడ దొరికిన ఇతర వస్తువులూ క్రీ.శ. 2వ శతాబ్దంలో కృష్ణాతీరం రోముతో సంబంధాలు కలిగి వుండేదని రుజువు చేస్తున్నాయి.

చూశారు కదా ప్రియ చదువరులారా!

అతి ప్రాచీన కాలము నుండే మన ఆంధ్రదేశానికి గ్రీకు మరియు రోమన్ ప్రజలతో సముద్ర మార్గము ద్వారా వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేది నిర్వివాదాంశం.

సో, గ్రీకు మరియు రోమన్ ప్రజలతో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సముద్ర మార్గం ద్వారా వ్యాపార సంబంధాలు ఉండేవి అనే విషయం చరిత్రపరంగా ఇష్టాబ్లిష్ అయిపోయింది.

రెండవదిగా దివిసీమ గూర్చి చూద్దాం:

కృష్ణాజిల్లాకు చెందిన దివిసీమ నుండి పదుల సంఖ్యలో ఒక బిషప్పుల బృందం క్రీ.శ. 325 లో ఇటలీలో జరిగిన నైసియా సభకు హాజరయ్యారని కొందరు స్కాలర్స్ చెప్పగా విన్నాను. దివిసీమ అనే ప్రదేశాన్ని దివోస్ అని పిలిచేవారట. ఈ పాయింటు ఇంగ్లీషులో కూడా చెక్ చేశాను, ఇది ఇలా ఉంది- As the tradition goes, an important event which could testify to the presence of Christians inAndhra Pradesh from the early centuries is the Council of Nicea held in 325 C.E. It is recorded that a delegation from “Divos” represented the Church in India in the Council. Some historiansidentify “Divos” as Diviseema.

ఈ దివిసీమ ప్రాంతం కృష్ణానది దగ్గర ఉన్నట్లు చరిత్రకారులు రాసారు. In the Diviseema region at the mouth of the Krishna river, కృష్ణానది ముఖద్వారం వద్ద దివిసీమ ప్రాంతంలో..

ఇదే విధంగా చూస్తే, 1956 లో CLS వారు ముద్రించిన సంఘ చరిత్రకు చెందిన ఒక తెలుగు పుస్తకంలో ఇలా వుంది-బందరు సమీపమున దివి అనే ఒక చిన్న లంక ఉన్నందున, థియోఫిలస్ అనే ఒక క్రైస్తవ విశ్వాసి వున్నాడని మనకు వున్న చరిత్ర ఋజువులను బట్టి ఇతడే ప్రధమాంధ్ర క్రైస్తవుడని మనము అనుకోవచ్చు అని ఉంది-

కాన్ స్టాంటిన్ చక్రవర్తి చనిపోయినప్పుడు దక్షిణ ఇండియా తూర్పుతీర పట్టణంలో భారతీయులు ఆయన పేరుతో ఒక స్మారక సన్మానాలు చేసారని చెప్పుకునేవారు. ఐతే, థియోఫిలస్ అనే ఈ క్రైస్తవుడు అంత నమ్మదగిన వ్యక్తి కాడు కనుక ఈ చరిత్రను అతడు నమోదు చేయకపోయాడేమోనని కొందరి భావన.

ఐతే ప్రముఖ చరిత్ర కారులైన జేమ్స్ ఎలీషా తానేటి గారు మాత్రం నైసియా సభకు దివిసీమ నుండి క్రైస్తవులు వెళ్ళారనే ఈ విషయాన్ని అంత స్పష్టంగా నిర్థారించి చెప్పలేము అన్నట్లు రాసారు- One of the delegate-bishops is believed to have represented “dhivi.” The advocates of this theory interpret this “dhivi” as Diviseema, an island adjacent to Machilipatnam. I hesitate to support this claim. There is no evidence strong enough to suggest that there was a native Christian community in the first century or the fourth century.

ముగింపు:

చరిత్రతో కూడిన నా అభిప్రాయాన్ని బట్టి చెప్పేదేమిటంటే, క్రీ.పూ. నుండే మన ఆంధ్రదేశానికి సముద్రవ్యాపార సంబంధాలు ఉన్న దరిమిలా దివిసీమకు లేదా మచిలీపట్నానికి కూడా క్రైస్తవ సువార్తికులు వచ్చియుంటారని అంగీకరించడంలో తప్పులేదు. మలబారుకు, పంజాబుకు, మద్రాసుకు ప్రారంభ శతాబ్ది కాలంలో క్రైస్తవులు వచ్చారని చెప్పినప్పుడు, మన ఆంధ్రప్రదేశునకు కూడా బహుశ వచ్చియుండవచ్చునని చెప్పడంలో అనుమానం లేదనేది నా అభిప్రాయం.

వ్యాస రచన- Suresh Babu Puritigadda- 8686357974

Endnotes:

1-ఆంధ్ర సదుక్తి కర్ణామృతము by యన్ యస్ సుందరేశ్వరరావు, నే శ్రీకృష్ణమూర్తి Publication date 1975

2-Ancient and medieval history of Andhra Pradesh by Raghunadha Rao, P, -1993, Pg-13.

3- Indian and Pakistan Christian church history- 1956 (CLS).

4-Periplus of the Erythraean Sea

5- సాహితీవాల్లభ్యము మొదటి భాగము ’సాహితీ వల్లభ’ ’ఆంధ్ర భోజ’ శ్రీ ముళ్లపూడి తిమ్మరాజుగారి అభినందన సంపుటి

6-దేవరకొండ చిన్ని కృష్ణశర్మ Books

7-ఆంధ్ర సదుక్తి కర్ణామృతము అనే గ్రంథంలో, యన్ యస్ సుందరేశ్వరరావు మరియు శ్రీకృష్ణమూర్తి

8-ఘంటసాల – గొర్రెపాటి వెంకటసుబ్బయ్య

9-ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర- Vol-1 లో కంభంపాటి సత్యనారాయణ

10- Telugu Christians: A History Book by James Elisha Taneti

3 Comments

  1. Worthful details about the foundation of Christianity found in ancient Andhra region in India explained dating back to 325 AD with evidences of Reference produced is a great task. Hatt’s off to you brother Suresh Patigadda. Keep it up. God Bless you more and more in the mighty name of Lord Jesus Christ ❤️ Amen 🙏 🙌 ✨️

  2. […] బైబిలులో ఇండియా గూర్చి చెప్పబడినది. కానీ అవి ఇండియాలోని ఏఏ ప్రదేశాలో స్పష్టంగా చెప్పబడలేదు. ఐతే చరిత్ర పుస్తకాల్లో ఆసక్తికరమైన విషయాలు చాలా చదవవచ్చు. మద్రాసు, కేరళ, కృష్టాజిల్లా, మచిలీపట్నం మొదలైన ఓడరేవులకు కూడా రోమా నుండి కార్గో షిప్పులు వచ్చేవి. ఈ విషయాన్ని నేను స్పష్టంగా రాసాను. ఇదే వెబ్ సైట్ లో Christian Roots in Andhra Pradesh అనే నా పరిశోధనా వ్యాసాన్ని చదవండి. https://psureshbabu.com/christian-roots-in-andhra-pradesh/ […]

Comments are closed.

error: Content is protected !!