Paul’s argument among Greeks.

పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా (అ.పొ.కా17:22), అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి (అ.పొ.కా.17:34).

పైన ఉటంకించిన వాక్యంలో “అరేయొపగు” అనే పదమును మనం చదవవచ్చు. దీని విషయమై కొంత ధ్యాన్నిద్దాం. నేటి కాలములో మనకు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రింకోర్టు ఎంత తిరుగులేని అధికారాన్ని కలిగియున్నదో అలాగే నాటి కాలములో గ్రీకు ప్రజల కు అరేయొపగు అనేది ఒక కమిటీతో కూడి, సర్వాధికారాలు కలిగిన సుప్రీంకోర్టు.

నవీన విషయాలను సేకరించడంలో గ్రీకులు ముందంజలో ఉండేవారు. చాలామంది ప్రజలు జీవనోపాధి నిమిత్తమై ఇతర దేశాలకు వెళ్ళేవారు కానీ, గ్రీకులు మాత్రం జ్ఞానాన్ని వెదుక్కుంటూ కొత్త సంగతుల సేకరణకై ప్రపంచాన్ని చుట్టి వచ్చేవారు. అలా వారు ఇండియాకు కూడా వచ్చి ఎన్నో విషయాలను గ్రంథస్థం చేసారు. పౌలు కాలానికి గ్రీకులు ప్రపంచంలోనే గొప్ప మేధావులుగా పేరు గడించారు. ఎప్పటికప్పుడు అప్డేటేడ్ ఇన్ఫర్మేషన్ వారి దగ్గర ఉండేది.

ఏథెన్సు ప్రజలలో ఉండే ఆసక్తి ఏమిటంటే క్రొత్త విషయాలపట్ల గ్రూప్ డిస్కషన్స్ చేసుకునేవారు. టైం దొరికినప్పుడల్లా వారు బజారు లేదా సంత వీధులలోనికి వెళ్ళి తమకు తెలిసిన నవీన సంగతులను తెలియజేసేవారు, లేదా తెలియని కొత్త సంగతులు అడిగి తెలుసుకునేవారు. ఏథెన్స్ లోని అగోరా అనే ప్రదేశం తత్వవేత్తలకు ఒక కూడలి లాంటిది. అక్కడకు వచ్చి అనేక మంది తమతమ అభిప్రాయాలను చెప్పుకుంటూ ఒకరునొకరు తర్కించుకునేవారు. The Agora was the center of civic life in Athens. There the philosophers gathered to discuss and debate their views. (1)

పౌలు కూడా ఇదే పద్దతిని అనుసరించి సంతవీధులలో సువార్త ప్రకటించాడు, అవసరమైనప్పుడు ప్రజలతో తర్కించాడు (అపొకా17:17).

ఇంతవరకూ బాగానే వుంది కానీ, ఏథెన్సు వాసులకు వున్న మరో దుర్భలమైన సమస్యేమిటంటే, తమకు మించిన నాణ్యతా ప్రమాణాలు కలిగిన బోధలు ఎవరైనా చెబితే వారు ఓర్చుకునేవారు కారు, అసూయతో ఈర్ష్యతో దుమ్మెత్తిపోసేవారు, కక్షతో పళ్ళునూరేవారు. సోక్రటీస్ చెబుతున్న కొంగ్రొత్త సంగతులను విని ఓర్వలేక అరేయొపగు అనే మహా సభకు తీసుకొని వచ్చియుంటారు. Socrates had also been led or brought to the Areopagus many centuries before, as was well known.(2)

ఇప్పుడు అదే పరిస్థితి పౌలుకు ఎదురైంది, ఏ సోక్రటిస్ నైతే అరేయొపగు సభలో దోషిగా నిలబెట్టారో అదేవిధంగా పౌలును కూడా నిలబెట్టారు. పౌలు వారి మధ్య మాట్లాడిన మాటలు అవహేళనగా వున్నప్పటికీ, ఆ కమిటీలో చాలామంది అపహాస్యము చేసినప్పటికీ, అక్కడ ఒక మహాద్భుతం జరిగింది. అదేమిటంటే ఆ మహాసభలో కమిటీ మెంబరైన దియోనూసి అనే పండితుడు క్రైస్తవునిగా మారాడు, Eusebius wrote that Dionysius became the first bishop of the church at Athens. (3)

అలా సంఘ కాపరిగా మారి ఆత్మీయంగా ఎదిగి ఒక చర్చికి పాస్టర్ గా జీవించి అనేకమందిని యేసుయొద్దకు నడిపించి, చివరకు హతసాక్షిగా చనిపోయాడని సంఘ చరిత్ర కారులు రాసారు.

ఎపికూరీయులు మరియు స్తోయికులు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని ఎందుకు చెప్పుకున్నారు? అలా వారు చెప్పుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?

ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి (అపొ.కా 17:18).

కొత్త సిద్ధాంతాలను, నవీన సంగతులను స్వయంగా దేవుళ్ళే తమకు అనుగ్రహించేవారని ప్రాచీన గ్రీకులు భావించేవారు. తమకు గిట్టని ఇష్టంలేని కొత్త సిద్ధాంతాలను దయ్యపు సిద్ధాంతాలని భావించేవారు. అలా పరిచయం లేని నవీన సంగతులను వారు విన్నట్లయితే అలా బోధించేవారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసేవారు, ఐనప్పటికీ వినకపోతే విషం తాగించి మరీ చంపేసేవారు. సోక్రటిస్ ను కూడా ఇలాగే అపార్థం చేసుకున్నారు. భగవంతుడు తమకు అనుగ్రహించిన సిద్ధాంతాలకు బదులుగా కొత్త సంగతులను బోధిస్తున్నాడేమిటి అని వారు తెగ బాధపడిపోయారు. అతని సిద్ధాంతాలు వేరే దేవుళ్ళను పరిచయం చేసినంత పొరపాటు చేస్తున్నట్లు సోక్రటిస్ ని వ్యతిరేకించారు. Socrates is guilty of rejecting the gods acknowledged by the state and of bringing in strange deities; he is also guilty of corrupting the youth. (4)

ఫ్లేవియస్ జోసీఫస్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని రాసాడు-తమకు పరిచయం లేని లేదా, వారి చట్టాల్లో లేని పరాయి సిద్ధాంతాలను ఎవరైనా ప్రతిపాదిస్తే ఏథెన్స్ ప్రజల మనోభావాలు దెబ్బతినేవి. పరాయి సిద్ధాంతాలను ప్రచారం చేస్తే దయ్యాలను ప్రచారం చేస్తున్నారని భావించేవారు. అలాంటివారికి శిక్షలు అతిభయంకరంగా ఉండేవి. Josephus writes that the Athenians severely punished those who initiated people into the mysteries of foreign gods; this was forbidden by their law, and the penalty decreed for any who introduced a foreign god was death. (5)

గ్రీకులలోని ఎపికూరీయులలోను స్తోయికులలోను పునరుత్థానాన్ని నమ్మరు. భూమ్మీద మనిషి జీవితం ముగిసిపోయాక మళ్ళీ పరలోకం నరకం ఉండవని నమ్మేవారు. అలాంటి సిద్ధాంతాలను నమ్మేవారికి పౌలు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని అన్నారు.

ముగింపు :

మొట్టమొదటిగా, పౌలు ఏథెన్స్ పట్టణంలో ప్రవేశించి మాట్లాడడం చాలా ప్రమాదకరమైన విషయం. అందులో అరేయొపగు అనే సభలో మాట్లాడడం ఇంకా ప్రమాదకరం. సత్యం చెప్పడానికి మనకు అవకాశం లభించినప్పుడు ఎవరు ఏమన్నా కూడా, ఏమి చేసినా కూడా చెప్పడానికి ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం లేదు.

తుఛ్చమైన ఇహలోక సిద్ధాంతాలను నమ్మి, సోక్రటిస్ అవసరమైతే విషం తాగడానికైనా సిద్ధపడ్డాడు తప్ప తాను నమ్మిన సిద్ధాంతాలను వదిలిపెట్టలేదు. అలాంటిది మరి మనం క్రీస్తు మరణ పునరుత్థానాలు అనే గొప్ప సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఆ రక్షణ సువార్తను ప్రకటించడంలో దాన్ని ప్రచురపరచడంలో భయపడాల్సిన అవసరం లేదు. సొక్రటిస్ నమ్మిన సిద్ధాంతాల కంటే ఔన్నత్యమైన సిద్ధాంతాలు మన క్రైస్తవ సార్వత్రిక సిద్ధాంతాలు.

మనం చెప్పిన సువార్త సందేశం చాలామందికి వెక్కిరింత కలిగేలా వున్నప్పటికీ, అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అనేవారు కనీసం ఒక్కరు లేదా ఇద్దరు మారినా వారు అనేకమందిని మారుస్తారు.

వ్యాసకర్త

Suresh Babu Puritigadda- 8686357974

End notes:

  1. Thomas Constable nots on Acts 17:17
  2. The IVP. Bible Background. COMMENTARY. New Testament .Keener. First Edition: ©1993 by Craig S. Keener, Notes on Acts-17:19-20.
  3. Thomas Constable notes on Atcs-17:32-34.
  4. Zondervan Illustrated Bible Backgrounds Commentary, Atcs. (Pg-13811).
  5. Josephus, Ag. Ap. 2.262–268, the quotation ibid. 267. Cf. Euripides, Bacch. 255–56.

2 Comments

Comments are closed.

error: Content is protected !!