Jews loved the temple more than God but what happened finally?

యూదుల మెప్పు పొందడం సులభం కాదు. యూదుల మనస్సును గెలవడానికి లేదా వారి దగ్గర నుండి మార్కులు కొట్టేయడానికి హేరోదు దేవాలయాన్ని మరమ్మత్తు చేసాడు. దాన్ని చాలా సుందరంగా రూపొందించాడు. మునుపు ఉన్నదానికంటే మరింత అందంగా నిర్మించాడు. చరిత్రకారుడైన జోసేఫస్ ఇలా రాసాడు – హేరోదు మరమ్మత్తు చేసిన దేవాలయం కేవలం నిర్మాణంలో పెద్దది మాత్రమే కాదు కానీ అది ఎంతో సుందరమైనది. అది బంగారు పలకలతో నిర్మించబడినది. సూర్య కిరణాలు పడినప్పుడు కళ్ళు జిగేల్ మనేటట్టు దాన్ని నిర్మించారు. బంగారం ఉపయోగించని చోట చలువరాతితో బహు అందంగా నిర్మించారు. దూరం నుండి చూసినప్పుడు తెల్లటి మంచు పడిందేమో అన్నంతగా అది కనబడేది. But the Second Temple wasn’t just big; it was also beautiful. The Jewish historian Josephus said that the temple was covered with gold plates, and when the sun shone on them it was blinding to look at. Where there was no gold, there were blocks of marble of such a pure white that from a distance strangers thought there was snow on the temple.

శత్రు రాజు నుండి ఆపద లేదా ఏదైనా మెరుపు దాడి జరిగితే యూదులు వెనువెంటనే తమ్మును తాము కాపాడుకోవడానికి దేవాలయం లోనికి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే అది ఎంతో ధృడంగా నిర్మించుకున్న కంచు కోట లాగా యూదులు భావించేవారు. It is said that at the fall of Jerusalem, the last surviving Jews of the city fled to the temple, because it was the strongest and most secure building in the city.

ప్రతీ దేశానికీ ఒక్కో నిర్మాణం సంస్కృతి సంపదగా నిలుస్తుంది. అనగా, ఈజిప్టులో పిరమిడ్లు, ఇండియాలో తాజ్ మహల్, పారిస్ లో ఈఫిల్ టవర్. ఇలా ఆయా దేశాల్లో ఆయా నిర్మాణాలు దేశ సౌభాగ్యానికి చరిత్రకు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఐతే యూదులు కూడా యెరూషలేము దేవాలయాన్ని గొప్ప వారసత్వ సంపదగా మురిసిపోయేవారు. వారు తమ దేవాలయాన్ని ఎంత అమితంగా ప్రేమించేశారంటే యూదులు తమ దేవాలయాన్ని మనిషి చూడకపోతే, భూమ్మీద మరెక్కడా కూడా అంత మనోహరమైన కట్టాడన్ని మనిషి చూడలేడని అనుకునేవారు. The rabbinic saying, “Whoever has not beheld Herod’s building [i.e., the temple] has not seen anything beautiful in his life,”

యూదులు దేవాలయము మీద అపారమైన గౌరవాన్ని ఇష్టాన్ని పెంచుకున్నారు. ఆ ఇష్టము కాస్త ముదిరి పాకాన పడి చివరికి పైత్యంగా మారిపోయింది.

ఎవరైనా కొత్తగా యెరూషలేముకు వస్తే యూదులు మొట్టమొదటిగా దేవాలయాన్ని చూపించడానికి దాని ఔన్నత్యమును గూర్చి వివరించడానికి తహతహలాడేవారు. ఇది ఎంతగా ముదిరిపోయిందంటే చివరికి దాని గొప్పదనాన్ని యేసు క్రీస్తుకే వివరించేంతగా అది ముదిరిపోయింది. యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి (మత్తయి 24:1).

ఐతే యేసుక్రీస్తు దేవాలయపు నాశనాన్ని గూర్చి ప్రవచించాడు. రాయి మీద రాయి కూడా లేకుండా ఈ దేవాలయం నాశనం అయిపోతుందని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్లు గానే అది నాశనం అయిపోయింది. రోమన్ చక్రవర్తి యూదుల మీదకు దాడి చేసినప్పుడు దేవాలయం అగ్నిలో దహించబడినది. రాయికి రాయికి మధ్య ఉన్న బంగారం కరుగుతున్న సమయంలో చూసిన సైనికులు లూటీ చేయడానికి మరింత ఎక్కువగా అగ్ని ద్వారా కరిగించి బంగారాన్ని దోచుకుపోయారు.

గుణపాఠం:

యూదులు దేవుని కంటే దేవాలయాన్ని ఎక్కువగా ప్రేమించారు. ఏ దేవుని కోసమైతే కట్టారో ఆయనను బయటకు తోసేసి దాని బాహ్య స్వరూపాన్ని ఎక్కువగా ఇష్టపడ్డారు.

నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అని కీర్తనాకారుడు చెప్పాడు (కీర్తన 32:7).

కానీ శత్రువులు దాడి చేసినప్పుడు దేవుని నుండి అభయం ఆశ్రయం పొందడానికి లేదా ప్రార్థన చేసి దేవునిపై ఆధారపడడానికి బదులు యూదులు దేవాలయములోకి వెళ్లి దాక్కునేవారు. ఇది కూడా వారు చేసిన అతిపెద్ద పొరపాటు. ఆపద సమయంలో దేవుడే మనకు దిక్కు అని ఆయనకు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన పరిష్కారం చూపిస్తాడు కానీ ఆయన్నే వదిలిపెట్టేసి బాహ్యమైన భవంతులలోకి వెళ్లి దాక్కుంటే అది చాలా పొరపాటు.

దేవునికంటే ఎక్కువగా మనం దేన్నీ ప్రేమించినా అది విగ్రహారాధనలో సమానం. ఆయనకంటే ఎక్కువగా మనం దేన్నీ ప్రేమించినా కూడా ఆయన దాన్ని మన దగ్గర నుండి లేకుండా చేస్తాడు.

యూదులు దేవునికంటే ఎక్కువగా దేవాలయాన్ని ప్రేమించారు కనుక వారికి బుద్ధి చెప్పడానికి తుదకు దేవుడే దాన్ని శత్రువుల చేతికి అప్పగించేసాడు.

Suresh Babu Puritigadda -8686357974.

Endnotes:

1- John Gill notes

2-The Enduring Word Bible Commentary

3-Zondervan Illustrated Bible Backgrounds Commentary

4-Thomas constable notes

One comment

Comments are closed.

error: Content is protected !!