What kind of temptations native Christian had faced ?

యేసు ఇలా చెప్పాడు- లోకములో మీకు శ్రమకలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను (యెహాను 16:33).

ప్రభువును నమ్మిన విశ్వాసులకు శోధనలు, కష్టాలు రావు అని బైబిలు చెప్పడం లేదు. కానీ, అలాంటి శోధనలు, బాధలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని నిలబడడానికి ప్రభువు శక్తిని ఇస్తాడని మాత్రం బైబిలు తెలియజేస్తున్నది. ప్రభువు కోసం నిజాయితీగా నిలబడిన వారికి సమాజంలో చాలా భయంకరమైన శోధనలు వస్తాయి. ఐనాకూడా వారు ఎలాంటి శోధనలకు భయపడకుండా గట్టిగా నిలబడతారు.

మన అంధ్రప్రదేశ్ లో కాకినాడ విశాఖపట్నం పరిసర ప్రదేశాల్లో కెనెడియన్ బాప్టిస్ట్ మిషనరీలు సువార్త సేవా పరిచర్య చేస్తున్న సమయంలో కొన్ని చెప్పుకోదగ్గ సంఘటనలు జరిగాయి.

అవి ఆంధ్రప్రదేశ్ లోని 1927 నాటి రోజులు. కొందరు హిందువులు నూతనంగా సువార్త విని ప్రభువును నమ్ముకున్నారు. అలాంటి సమయంలో వారిని తిరిగి మళ్ళీ హిందువులుగా మార్చడానికి బంధువులు చాలా ప్రయత్నాలు చేసారు. కలరా లాంటి రోగాలు సంభవించిన ప్రతిసారీ కూడా నూతనంగా రక్షింపబడిన స్థానిక విశ్వాసులకు కఠిన పరీక్షల సమయంగా చెప్పుకోవచ్చు. మీరు మన దేవీదేవతలను విడిచిపెట్టి పరాయి దేవుణ్ణి హత్తుకున్నారు కనుక మన గ్రామ దేవతలకు ఆగ్రహం కలిగింది. అందుకే ఇలాంటి కలరా రోగాలు పంపించి తమ కోపాన్ని శాపాన్ని మన గ్రామం మీదకు పంపిస్తున్నారు . మీరు యేసుప్రభువును నమ్ముకున్నందుకే మన గ్రామానికి ఇలాంటి దుర్గతి పట్టింది కనుక వెంటనే ఆ ప్రభువును వదిలిపెట్టేసి మన మతంలోనికి వచ్చేయండి అప్పుడు మన దేవతలకు కోపం తగ్గి తెగులు వెనక్కి తీసుకుంటారు. లేదంటే మీరు క్రైస్తవులుగా మారినందుకు ఈ రోగంతో మన ఊరుఊరంతా నాశనం ఐపోతుంది అని తెగ దుమ్మెత్తిపోస్తూ ఆడిపోసుకునేవారు. మన దగ్గర లేనిదేమిటి, మిషనరీల దగ్గర వున్నదేమిటి, మేము మీకు ఏమి కావాలన్నా సమకూరుస్తాము మీకు ఉత్తమమైన వసతులు కల్పిస్తాము అంటూ విశ్వాసులను వెనక్కి లాక్కోవడానికి మిగతా హిందువులు చాలా ఆశలు చూపించారు. ఐనప్పటికీ కూడా స్థానిక క్రైస్తవ విశ్వాసులు విశ్వాసంలో ముందుకు కొనసాగిపోయారు తప్ప భయపడలేదు బెదిరిపోలేదు. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోలేదు

కృష్ణాజిల్లాలో కూడా ఒక సంఘటన చోటు చేసుకున్నది. మిషనరీల సేవా పరిచర్యను చూసి సువార్త విని స్థానికంగా ఉన్న కొందరు హిందువులు క్రైస్తవులుగా మారారు. వారిలో ఏడుమంది బాప్తిస్మము పొందారు. వారు ఒకరోజు రాత్రి ఒక పూరి గుడిసెలో నిద్రపోతున్న సమయంలో అగ్రకులస్తులు ఆ గుడిసెకు నిప్పుపెట్టి ఆ ఏడుమంది క్రైస్తవ విశ్వాసులను మంటల్లో తగలబెట్టేయాలని కుట్రపన్నారు, ఐతే ఆ కుట్ర క్రైస్తవ మిషనరీలకు తెలిసినప్పుడు హుటాహుటీన వెళ్ళి ఆ ఘోర హత్యాయత్నం జరగకుండా ఆపగలిగారు.

కొత్తగా ప్రభువును నమ్మిన స్థానిక గ్రామస్తులు బాప్తిస్మము పొంది, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఎలాంటి భౌతిక అవసరతలకు ఆశ పడకుండా మరణ పర్యంతం విశ్వాసులుగా ప్రభువులో నమ్మకంగా జీవించారు.

Suresh Babu Puritigadda -8686357974

Endnotes:

1- THE MISSIONARY ENTERPRISE OF THE CANADIAN BAPTIST CHURCH IN ANDHRA PRADESH – AN APPRAISAL By G.BEULAH PEARL SUNANDA M.A., M.Phil, Pg-150.

2- Report of the Canadian Baptist Teluga Missions for 1899, Ontario and Quebec Mission (organized 1874), Maritime Provinces’ Mission (organized 1875). Twenty-third annual conference held in Cocanada, January 12-16, 1900).

error: Content is protected !!