Liberty, Equality, Fraternity.

హరించకూడని హక్కులు మనిషికి ఎలా కలిగాయి?

ప్రాచీన కాలపు నాగరికతలన్నీ కూడా బానిసత్వము మీద బ్రతికి బలిసినవే. బానిస విధానం లేకపోతే గ్రీకుల విజ్ఞానం ఉండేది కాదు. శూద్రులు లేకపొతే బ్రాహ్మణుల జ్ఞానము ఉండేది కాదు. The Hell are being made for such as not serve Rome. అనగా రోమను ప్రజలకు దాస్యము చేయనివారి కొరకు నరకము సృష్టించబడినవి అని రోమనులు రాసుకున్నారు. ఇదేవిధంగా, బ్రాహ్మణుడికి దాస్యం చేయడానికే లేదా సేవ చేయడానికే శూద్రుడు నిర్మించబడ్డాడు అని భారతవర్షములో బ్రాహ్మణులు కూడా రాసుకున్నారు.

ప్రాచీన కాలంలోని నాగరికతలన్నీ కూడా ఒక మనిషి ఇంకో మనిషిపై పెత్తనం చేసిన వైఖరి మనం చూడొచ్చు. కానీ ఒక్క బైబిలులో మాత్రమే మానవులందరూ సమానమే అని, అందరికీ కూడా సహజసిద్ధమైన హక్కులు ఉంటాయి అని చెప్పబడింది.

The Rights of Man అనే గ్రంథంలో థామస్ పెయినీ ఇలా రాసాడు – దేవుడు మనిషిని తన స్వరూపంలో చేశాడు. ఇక్కడ పురుషుడు స్త్రీ అనే లింగ బేధమే తప్ప మరెందులోనూ హెచ్చుతగ్గులు లేవు. మోషే రాసిన ఈ విషయం దైవప్రేరితమైన సార్వభౌమత్వంతో రాయబడినదని అంగీకరించకపోయినా కూడా, చరిత్రపరంగా చూసినా కూడా స్త్రీపురుషులు సమానులే అనే విషయం ఇట్టే బోధపడుతుంది (The Rights of Man).

ఇదే విధంగా Common Sense అనే పుస్తకంలో కూడా తామస్ పెయినీ ఇలా రాసాడు- మనుషులందరూ కూడా సమానంగానే సృష్టించబడ్డారు, స్త్రీ, పురుష లేదా మంచి చెడు అనే తేడాలు ఉన్నాయేమో కానీ మనుషులందరూ సమానులే.

ఈ తామస్ పెయినీ మరెవరో కాదు, అమెరికాకు చెందిన ప్రముఖ తత్వవేత్త, రాజకీయ ఉద్యమ కర్త, రాజనీతి సిద్ధాంతకర్త. అమెరికా దేశ వ్యవస్థాపక నాయకులలో ఒకరు.

తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించవలసిందిగా దేవుడు మోషేను ఫరో యొద్దకు పంపిస్తాడు, అలా వారి బానిసత్వము నుండి స్వయంగా దేవుడే విడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు నిరీక్షణను మరియు స్వేఛ్చను అనుగ్రహింపబడినట్లు రాయబడిన నిర్గమాకాండము, తరువాతి కాలంలో హక్కులను కాపాడుకోవడానికి ఎంతోమందికి గొప్ప స్ఫూర్తిని అందించింది. ఈ నిర్గమాకాండము అమెరికాలోని నల్లజాతి ప్రజలకు విడుదల ఇవ్వడానికి, మార్టీన్ లూథర్ జూనియర్ విప్లవ పోరాటానికి, పౌర హక్కుల ఉద్యమానికి దోహద పడింది. It was no “book of fate” but Exodus, the book of faith and freedom, that made possible the liberation of the Israelite slaves, the later liberation of the African American slaves, and the emergence of Dr. Martin Luther King Jr. and the civil rights movement.

ఇదే విధంగా, బరాక్ లూరీ తాను రాసిన పుస్తకంలో ఇలా ఒక అద్భుతమైన చారిత్రక సత్యాన్ని ప్రస్తావించాడు- దక్షిణ అమెరికాలో బానిసత్వపు సంకెళ్ళలో కొట్టిమిట్టాడుతున్న ప్రజలకు ఓదార్పును ఇచ్చింది క్రైస్తవమే. బానిసత్వపు చీకటి యుగంలో వున్న ప్రజలు తమకు గౌరవప్రదమైన జీవితాన్ని ఆశించినప్పుడు వారు మార్కస్ అరేలియస్ తట్టు లేదా, డేవిడ్ హ్యూమ్ తట్టు చూడలేదు కానీ బైబిలు తట్టు వారు చూసారు. స్వాతంత్ర్యానికి చెందిన నిరీక్షణ కోసం వాల్టేర్ మరియు డోల్బాగ్ మీద నమ్మకం పెట్టుకోలేదు. వారు మోషే ఇశ్రాయేలీయులను విడుదల చేసిన సన్నివేశం రికార్డు చేయబడిన నిర్గమాకాండమును బట్టి వారు స్ఫూర్తి పొందారు. విల్బర్ ఫోర్స్ ద్వారా నడిపించబడిన బానిసత్వపు నిర్మూలన అనే ఉద్యమం పెను సంచలనాన్ని సృష్టించింది. మనుషులందరం దేవుని పోలికలో సమానంగా నిర్మించబడ్డాము, ఒకడు మరొక మనిషి మీద పెత్తనం చేయడం నేరం, ఈ సూత్రం ద్వారానే ప్రజాస్వామ్యము ప్రారంభమయింది మరియు బానిసత్వము నిర్మూలించబడినది. “In the American South, Christianity proved to be the solace of the oppressed. …. [W]hen black slaves sought to find dignity during the dark night of slavery, they didn’t turn to Marcus Aurelius or David Hume; they turned to the Bible. When they sought hope and inspiration for liberation, they found it not in Voltaire or D’Holbach but in the Book of Exodus.” He further notes: “The anti-slavery movements led by Wilberforce in England and abolitionists in America were dominated by Christians. These believers reasoned that since we are all created equal in the eyes of God, no one has the right to rule another without consent. This is the moral basis not only of anti slavery but also of democracy.

దేవుడు తన స్వరూపంలో మనుష్యులందరినీ ఒకే రకంగా సృజించినప్పుడు ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరూ సమానంగా ఉంటారు. అనగా, స్వేచ్ఛ (Liberty), సమానత్వము (Equality) సౌభ్రాతృత్వం (Fraternity) కలిగి జీవిస్తారు.

పుట్టించిన ఆ దేవుడే ప్రతీ మనిషికీ కూడా కొన్ని స్వాభావిక హక్కులు ఇచ్చాడు. అవి Inalienable rights గా ఎంచబడ్డాయి, అనగా ఎవరు కూడా దొంగిలించడానికి లేదా హరించడానికి వీలు కానివి. ఒకవేళ అలా ఒక మనిషి హక్కులను దొంగిలించే ప్రయత్నం చేసినా లేదా హరించడానికి సాహసించినా ఆ వ్యక్తి తన హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయవచ్చు.

మాల్కం మగ్గిరిడ్జ్ ఒకప్పుడు క్రైస్తవుడు కాకపోయినా కూడా తరువాతికాలంలో క్రైస్తవునిగా మారాడు. ఇతడు మంచి ఆలోచనాపరుడు, గొప్ప రాజకీయ నిపుణుడు మరియు సామాజికవేత్త. ఈ మాల్కం మగ్గిరిడ్జ్ ఇలా అన్నాడు- పౌర హక్కులు మనకు బైబిలుపరమైన క్రైస్తవ విశ్వాసము ద్వారానే వచ్చాయి అనేది చాలామందికి తెలీదు, ఇది వాస్తవమైన విషయం, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత ప్రేమించబడేవాడే, కుంటివాడు గానీ, గుడ్డివాడు గానీ, పిచ్చివాడు గానీ, అందగాడు గానీ, అందవిహీనుడు గానీ, ఎలాంటివాడైనా కూడా అతనికి ప్రాథమిక హక్కులు సహజసిద్ధంగా వస్తాయి. Individual freedom and rights are most prevalent where Christianity has had the greatest impact. This truth, which is often not known or recognized, needs to be told and retold. All freedom loving people would do well to recall the words of Malcolm Muggeridge, once a non-Christian but later a strong defender of Christianity. Said he, “We must not forget that our human rights are derived from the Christian faith. In Christian terms every single human being, whoever he or she may be, sick or well, clever or foolish, beautiful or ugly, every human being is loved by his Creator, who as the Gospels tell us, counted the hairs of his head.

The end of Christendom అనే పుస్తకంలో మాల్కం మగ్గిరిడ్జ్ ఇలా రాసాడు- భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా స్వభావసిద్దంగా కొన్ని హక్కులు ఉంటాయి, పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని కుమారుడే, దేవుని చేత ప్రేమించబడేవాడే, అతని వెంట్రుకలన్ని కూడా లెక్కించబడ్డాయి, దేవుని అనుమతి లేకుండా కనీసం వెంట్రుక అయినా నేల రాలదు, వారు పిచ్చుకల కంటే గొప్పవారు. ఈ కాన్సెప్ట్ ప్రకారమే హ్యుమన్ రైట్స్ అనేవి ప్రతిమనిషికి కూడా సహజసిద్ధంగా ఉంటాయి అని తెలియజేయబడినది. Human rights, we forget that our human rights are derived from the Christian faith. In Christian terms every single human being, whoever he or she may be, sick or well, clever or foolish, beautiful or ugly, every single human being is loved of his Creator, who has, as the Gospels tell us, counted the hairs of his head. This Creator cannot see even a sparrow fall to the ground without concern. Now it is from that concept that our rights derive. You will find as we move away from Christendom that whatever declarations may be made and agreements may be concluded, these basic human rights depend ultimately on the Christian concept of man and of his relationship to his Creator.

డా. బాబా సాహేబ్ అంబేద్కర్ ఈ స్వేచ్ఛ (Liberty), సమానత్వము (Equality) సౌభ్రాతృత్వం (Fraternity) అనే అంశాలను బుద్ధుని నుండి స్వీకరించినట్లు చెప్పాడు- Positively, my Social Philosophy, may be said to be enshrined in three words. Liberty, Equality, and Fraternity. Let no one, however, say that I have borrowed my philosophy from the French Revolution. I have not. My philosophy has roots in religion and not in political science. I have derived them from the teachings of my Master, the Buddha. In his philosophy, liberty and equality had a place, but he added that unlimited liberty destroyed equality, and absolute equality left no room for liberty.

ఈ విధంగా ప్రాచీన మరియు ఆధునిక ప్రపంచ మానవాళి ప్రాథమిక హక్కులతో ఆత్మ గౌరవంతో జీవించడానికి సమానత్వం పొందేలా దేవుడు అందరినీ ఒకేలా నిర్మించాడు. ఈ సమానత్వము అనే కాన్సెప్ట్ మనకు బైబిల్లో కనబడుతుంది.

మనిషిని డిగ్నిఫైగా బ్రతకమని చెప్పింది బైబిలు విలువలు. ప్రతీ మనిషికి కూడా హక్కులు ఉంటాయని గుర్తుచేసింది బైబిల్. మనిషికి సహజసిద్ధంగా ఉన్న సామాజిక నైతిక హక్కులు రూపుదిద్దుకోవడానికి బైబిలు ఎంతగానో దోహదపడిందని చరిత్ర సత్యాలు చెప్తున్నాయ్.

End Notes:

1- The Magna Carta of Humanity: Sinai’s Revolutionary Faith and the Future of Freedom Book by Os Guinness, Pg-58

2- Atheism Kills: The Dangers of a World Without God, by Barak Lurie, published: November 2017, Pg-330.

3- How Christianity Changed the World Book by Alvin J Schmidt, Published: 2004, Pg-308.

4- The Social Results of Early Christianity By Charles Schmidt, 2nd, 1889, Pg-76.

5- How Christianity Changed the World Book by Alvin J Schmidt, Pg-317.

6- The end of Christendom Book by Malcolm Muggeridge, published: 1980, Pg- 22

7- Thomas Paine Writings.

8- Ambedkar writings and speeches, Vol-17.

Article by Suresh Babu Puritigadda- 8686357974

error: Content is protected !!