అడ్డుగా ఉన్న రాయి.

యేసు రాయి తీసివేయుడని చెప్పగా..... ( యోహాను 11:39).

నాలుగు రోజులపాటు లోపల ఉన్న శవాన్ని సజీవంగా బయటకు పిలిచే శక్తివున్నయేసుకు రాయిని ప్రక్కకి తొలగించడం పెద్ద పని కాదు.కాని యేసు రాయి ప్రక్కకు తొలగించమని అక్కడున్న వారికి స్పష్టంగా ఆదేశిస్తున్నాడు, ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ? దైవకార్యాలు మనజీవితాల్లో జరగాలంటే ముందు దేవునికి మనకి అడ్డుగా ఉన్న రాళ్ళు మనమే ప్రక్కకి తొలగించుకోవాలి అది మనపనే తప్ప దేవునిపని కాదు.

దేవునికి మనకు అడ్డుగా వచ్చే మన తప్పుడుకార్యాలు మేఘాలుగా పరిణమించి దేవుని కార్యాన్ని అడ్డుకుంటాయి, కాని మనలను రక్షించడానికి ఆయన హస్తం ఏనాడు కురచకాదు. చెడు అలవాట్లు, చెడు సహవాసాలు, దేవునికంటే ఎక్కువగా ఇతరులను ప్రేమించే మనసు, ఎదుటివారినుండి పొగడ్తలు రావాలని ఆశించడం, దేనికీ పనికి రాను అనే న్యూన్యతాభావం మొదలైన రాళ్ళను మనం ప్రక్కకి తొలగించుకోవాలి. అవి తొలగించుకోకపోవడం వలన దేవుడు అద్భుతాలు చేయడంలో ఆలస్యంచేస్తున్నాడు, అది మనతప్పే. అడ్డుబండలు తొలగించుకో దేవునికార్యం చవి చూస్తావు. అడ్డుబండలు నీవు తొలగించుకోకుండా అద్భుతాలు ఆశించడం హాస్యాస్పదం.